ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే ఉదయభానుపై ఉన్న పది కేసులూ ఎత్తివేత
- జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో కేసుల నమోదు
- ప్రజాప్రతినిధుల కోర్టులో వివిధ దశల్లో విచారణ
- కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కేసుల ఎత్తివేతకు వీలుగా ఆయా కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. ఉదయభానుపై జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో వివిధ అభియోగాలతో పలు కేసులు నమోదయ్యాయి.