తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో దొంగ ఓట్ల రచ్చ.. ప్రతిపక్షాల ఆరోపణలు!
- దొంగ ఓటర్లను రప్పించారంటూ టీడీపీ, బీజేపీ ఆరోపణ
- ప్రైవేటు బస్సులను ఆపి, రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు
- పెద్దిరెడ్డి ఫంక్షన్ హాల్లో దొంగ ఓటర్లను పెట్టారంటూ ఫిర్యాదు
పోలింగ్ బూత్ లకు వచ్చిన దొంగ ఓటర్లను కూడా అడ్డుకున్నారు. వారి నుంచి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో వందలాది మంది దొంగ ఓటర్లను నిన్ననే తీసుకొచ్చి పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారంతా అక్కడి నుంచి జారుకున్నారని తెలిపారు.