ఎన్టీఆర్ మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
- త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్
- ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ప్రచారం
- త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలయ్యే అవకాశం
అయితే బలంగా జరుగుతున్న ప్రచారాన్ని చూస్తూ ఊరుకుంటే, అదే నిజమని అనుకునే అవకాశం ఉంది గనుక, ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. 'అది నైస్ జోక్ గైస్ ' అని ట్వీట్ చేస్తూ, ఫన్నీ ఇమోజిస్ జత చేశారు. అలా ఆయన ఈ సినిమా ఆగిపోయిందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారానికి తెర దించేశారు.
కోవిడ్ వైపు నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఈ నెల చివరిలోగానీ .. వచ్చేనెల మొదటివారంలో గాని 'అయిననూ పోయిరావలె హస్తినకు' రెగ్యులర్ షూటింగు మొదలు కావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.