ఈ ఫలితాలు చూస్తుంటే టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నా: లక్ష్మీపార్వతి
- ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పరాజయం
- తండ్రీకొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాలన్న లక్ష్మీపార్వతి
- ఎన్టీఆర్ కు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు ఎదురైందని వెల్లడి
- నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును వదిలేయాలని సూచన
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంపపెట్టు లాంటివని, నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఇంకా ఉంటే వారు చంద్రబాబును వదిలేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోలేడని, ఆయనకు మతిపోయిందని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ భవిష్యత్తు ఏంటో ఊహించడమే కష్టంగా ఉందని అన్నారు. తన సుపరిపాలనతో సీఎం జగన్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడని, మరో మూడు దశాబ్దాల పాటు జగనే సీఎం అని వెల్లడించారు.