జోధ్ పూర్ లో భారీ విన్యాసాలు నిర్వహించనున్న భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా విన్యాసాలు
- ఈ నెల 20 నుంచి వాయుసేన విన్యాసాలు
- ఐదు రోజుల పాటు సాగనున్న విన్యాసాలు
- భారత్ తరఫున పాల్గొంటున్న రాఫెల్, సుఖోయ్, మిరేజ్
ఈ విన్యాసాల్లో భారత్ తరఫున రాఫెల్, మిరేజ్-2000, సుఖోయ్-30ఎంకేఐ, ఐఎల్-78 ఫ్లయిట్ రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్, అవాక్స్, ఏఈడబ్ల్యూ అండ్ సీ విమానాలు పాల్గొంటాయి. ఫ్రాన్స్ వాయుసేన నుంచి రాఫెల్, ఎయిర్ బస్ ఏ-330 మల్టీరోల్ టాంకర్ ట్రాన్స్ పోర్ట్ (ఎంఆర్ టీటీ), ఏ-400ఎం టాక్టికల్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటాయి.