ఇల్లు కొనే పనిలో బిగ్ బాస్ భామ
- బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత చేరువైన మోనల్
- బిగ్ బాస్ తర్వాత మోనల్ కు పెరిగిన డిమాండ్
- హైదరాబాదులో ఇల్లు కొనే పనిలో మోనల్
ఈ సీజన్ లో ఫైనల్ కు చేరలేకపోయినా... ప్రేక్షకులకు మరింత చేరువైంది హీరోయిన్ మోనల్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు డిమాండ్ కూడా పెరిగిపోయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలలో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. మరోవైపు ఆమె ఇల్లు కొనే పనిలో బిజీగా ఉందట. తనకు ఎంతో పాప్యులారిటీని ఇచ్చిన హైదరాబాదులోనే ఇల్లు కొనే పనిలో ఆమె ఉంది. ఇక్కడే సెటిల్ కావాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు ఫిలింనగర్ టాక్.