కమలహాసన్ వ్యాఖ్యలను తప్పుపట్టిన కంగన రనౌత్
- ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామన్న కమల్
- ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడొద్దన్న కంగన
- ఇంటి యజమాని అయిన మహిళను ఉద్యోగిగా మార్చొద్దు
ఇంట్లో మహిళ చేసే పనికి విలువ కట్టొద్దని కంగన అన్నారు. మాతృత్వానికి, అమితంగా ప్రేమించే వ్యక్తులతో శృంగారానికి వెల కట్టొద్దని చెప్పారు. ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడొద్దని తెలిపారు. మహిళలకు కావాల్సింది వేతనం మాత్రమే కాదని... ప్రేమ, గౌరవం కూడా అని అన్నారు. ఇంటి యజమాని అయిన మహిళను ఉద్యోగిగా మార్చొద్దని చెప్పారు. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలని భావించొద్దని సూచించారు.