భయపడొద్దు.. ధైర్యంగా వచ్చి ఓటు వేయండి: విజయ్ దేవరకొండ
- ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు సెలబ్రిటీలు
- కుటుంబంతో వచ్చి ఓటు వేసిన విజయ్ దేవరకొండ
- ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాలని పిలుపు
ఓటు వేసిన అనంతరం విజయ్ మాట్లాడుతూ, హైదరాబాదులో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని, శానిటైజర్లను ఏర్పాటు చేశారని, సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... ధైర్యంగా వచ్చి ఓటు వేయాలని కోరారు. ఓటు వేస్తే మజా వస్తుందని అన్నారు. కౌంటింగ్ జరిగే 4వ తేదీన ఏమవుతుందో చూద్దామని చెప్పారు.