Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: 2,886 పాజిటివ్ కేసులు, 17 మరణాలు

AP Corona Virus spreading statistics
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 2,886 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తం 84,401 కరోనా టెస్టులు నిర్వహించారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 493 కేసులు రాగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 36 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 17 మంది కరోనాతో చనిపోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 6,676కి పెరిగింది.

తాజాగా 3,623 మందికి కరోనా నయం అయినట్టు ఇవాళ్టి బులెటిన్ లో వెల్లడించారు. ఏపీలో ఇప్పటివరకు 8,20,565 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,88,375 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 25,514 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Statistics
Update
Bulletin
Positive Cases
Deaths

More Telugu News