డ్రగ్స్ కేసు: విచారణ నిమిత్తం ముంబై చేరుకున్న హీరోయిన్లు రకుల్, దీపిక
- ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న రకుల్
- డ్రగ్స్ చాటింగ్ గురించి ప్రశ్నించనున్న అధికారులు
- నిన్న రాత్రి భర్తతో కలిసి ముంబైకి దీపిక
కాగా, హీరోయిన్ దీపికా పదుకొణే కూడా కాసేపట్లో అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి నిన్న రాత్రి ఆమె గోవా నుంచి ముంబైకు వచ్చారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఘటన అనంతరం విచారణ జరుపుతోన్న అధికారులకు సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల కోణం గురించి తెలిసిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొణేతో పాటు సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లకు కూడా అధికారులు సమన్లు జారీ చేశారు.