నోటీసులపై దీపిక స్పందించింది: ఎన్సీబీ వెల్లడి
- సుశాంత్ మృతిలో డ్రగ్స్ కోణం
- దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ అధికారులు
- ఇప్పటికే రియా చక్రవర్తి అరెస్ట్
- రియా వాంగ్మూలం ఆధారంగా పలువురికి నోటీసులు
ఈ నేపథ్యంలో, ఎన్సీబీ అధికారులు స్పందించారు. తాము పంపిన నోటీసులు అందినట్టు దీపికా పదుకొణే బదులిచ్చారని వెల్లడించారు. దీపిక తదితరులను విచారిస్తే మరింత సమాచారం వెల్లడవుతుందని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు. కాగా, ఓ సినిమా షూటింగ్ కోసం దీపిక ప్రస్తుతం గోవాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్సీబీ నోటీసుల నేపథ్యంలో ఆమె తన న్యాయవాదితో సంప్రదిస్తున్నట్టు సమాచారం.