'రాధే శ్యామ్' అప్ డేట్.. ఇటలీలో షూటింగ్?

Radhe Shyam unit to fly to Italy
షార్ట్స్‌లో చూడండి
ఇన్నాళ్లూ లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన దర్శక నిర్మాతలు మెల్లగా ఇక షూటింగులకు సిద్ధం అవుతున్నారు. కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ షూటింగులు చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా షూటింగుకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఆరు కోట్ల వ్యయంతో భారీ ఆసుపత్రి సెట్స్ వేశారు. వచ్చే నెల ద్వితీయార్థం నుంచి షూటింగు నిర్వహించాలని షెడ్యూల్ కూడా వేసుకున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. యూరప్ లో టూరిజం విషయంలో నిబంధనలను సడలిస్తుండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలని చిత్రం యూనిట్ భావిస్తోందట. దీంతో మొదట్లో అనుకున్నట్టుగానే ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. ఇందుకోసం చార్టెడ్ ఫ్లయిట్ ను బుక్ చేసుకుని యూనిట్ ని అక్కడికి తరలించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ముందుగా ఇటలీలో షూటింగ్ చేస్తారా? లేక రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ లో చేస్తారా? అన్న విషయంలో త్వరలో స్పష్టత వస్తుంది.  
Go Back to Shorts
Prabhas
Pooja Hegde
Radhe Shyam
Radha Krishna

More Telugu News