గతంలో నా ఫోన్ను చంద్రబాబు ట్యాపింగ్ చేయించారు.. ఆధారం ఇదిగో: సజ్జల
- మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు
- ఆధారాలను న్యాయస్థానాలకు మేము సమర్పించాం
- ఇలాంటి ఆధారాలు చంద్రబాబు ఎందుకు చూపించడం లేదు
తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఫోన్ ను చంద్రబాబు ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇది అంటూ ఒక ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఈ ఆధారాన్ని తాము న్యాయస్థానాలకు కూడా సమర్పించామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్న చంద్రబాబు ఇలాంటి ఆధారాలు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.