హీరో రామ్ కు బాసటగా నిలిచిన చంద్రబాబు
- స్వర్ణ ప్యాలెస్ ఘటనపై స్పందించిన రామ్
- నోటీసులు ఇస్తామన్న విజయవాడ ఏసీపీ
- ప్రశ్నించే గొంతును అణచివేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న చంద్రబాబు
ఈ నేపథ్యంలో హీరో రామ్ కు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు నిలిచారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని చంద్రబాబు చెప్పారు. ట్వీట్ చేస్తే... విచారణకు అడ్డుపడుతున్నారంటూ నోటీసులు ఇస్తామని బెదిరించడం సరికాదని అన్నారు. ఏపీలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పారు. ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.