'ధోనీ రిటైర్మెంటు'పై ఆసక్తికర అంశం వెల్లడించిన మంజ్రేకర్
- చాన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారిన ధోనీ
- కోహ్లీ పెళ్లి సమయంలో ధోనీతో మాట్లాడానన్న మంజ్రేకర్
- ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్న ధోనీ
"కోహ్లీ పెళ్లి సమయంలో ధోనీతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతుండగా, ధోనీ కెరీర్ గురించి ప్రస్తావన వచ్చింది. రిటైర్మెంట్ గురించి, ఫిట్ నెస్ గురించి అడిగితే ధోని ఇలా చెప్పాడు.... టీమిండియాలో అందరికంటే వేగంగా పరిగెత్తే ఆటగాడిని ఓడించగలిగినంత కాలం నేను ఫిట్ గా ఉన్నట్టు భావిస్తాను. ఆ విధంగా పరిగెత్తలేకపోతే మాత్రం రిటైర్మెంట్ ప్రకటిస్తాను అని తెలిపాడు" అని మంజ్రేకర్ వివరించాడు.
కాగా, ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ తెరలేపిన నేపథ్యంలో ధోనీ ప్రాక్టీసు ముమ్మరం చేశాడు. ఐపీఎల్ లో ఆటతీరు ధోనీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.