నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- నాలుగు నెలల తర్వాత నేటి నుంచి అంతర్జాతీయ విమాన సేవలు
- అమెరికా, ఫ్రాన్స్, జర్మనీల నుంచి విమానాలు
- సర్వీసులు ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా
ఈ నెల 18 నుంచి ఆగస్టు 1 మధ్య ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన 28 విమానాలు నడవనున్నాయి. అలాగే, ఈ రెండు దేశాలకు ఎయిర్ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మరోపక్క, ఢిల్లీ, లండన్ మధ్య రోజుకు రెండు విమానాలు నడిపేందుకు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. జర్మనీకి చెందిన ఎయిర్ లుఫ్తాన్సాతో దాదాపు ఒప్పందం పూర్తయిందని మంత్రి పూరి వివరించారు.