బాబాయ్ బ్యానర్లో చరణ్ తదుపరి సినిమా!
- ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న చరణ్
- ఇటీవల త్రివిక్రమ్ తో చరణ్ భేటీ
- ఎన్టీఆర్ తో సినిమా తర్వాత చరణ్ ప్రాజక్టు
ప్రస్తుతం కొందరు దర్శకులు చెబుతున్న కథలు వింటున్నప్పటికీ, ఇంకా ఆయనకు ఏదీ నచ్చలేదట. ఇదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఈమధ్య చరణ్ భేటీ అయ్యాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రానుందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నారు. ఇది పూర్తయ్యాక చరణ్ తో చేసే ప్రాజక్టుపై కూర్చుంటారని తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజక్టును చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ నిర్మించడానికి సిద్ధంగా వున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చు.