ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన టీనేజ్ టిక్ టాక్ స్టార్

Teenage Tik Tok star Siya Kakkar commits suicide
  • 16 ఏళ్ల సియా కక్కర్ బలవన్మరణం
  • గత రాత్రే ఆమెతో మాట్లాడానన్న మేనేజర్
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
వినోద రంగానికి ఈ ఏడాది ఏమంత ఆశాజనకంగా లేదు సరికదా, అనేక విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. తాజాగా, ఢిల్లీకి చెందిన ఓ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె పేరు సియా కక్కర్. వయసు 16 ఏళ్లు. దీనిపై ఆమె మేనేజర్ అర్జున్ సరిన్ మాట్లాడుతూ.... సియాతో ఓ కొత్త పాట గురించి తాను గతరాత్రే చర్చించానని తెలిపారు. ఆమె ఎంతో ఉత్సాహం ప్రదర్శించిందని, కానీ ఇవాళ ఈ ఘటన జరగడం నిర్ఘాంతపరిచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సియా కక్కర్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Siya Kakkar
TikTok
Suicide
Police
New Delhi

More Telugu News