రెండు ఆహార ఉత్పత్తులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశం
- షాలిమార్స్ ధనియాల పొడిలో అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు
- ఆక్వాగ్రి క్యారెజీనన్‌లో ప్రమాదకరమైన కాడ్మియం ఉన్నట్టు గుర్తింపు
- కంపెనీల అప్పీల్ తర్వాత రీ-టెస్టుల్లోనూ ఉత్పత్తులు సురక్షితం కావని నిర్ధారణ
- ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందున తక్షణ చర్యలు
రెండు ప్రముఖ కంపెనీలకు చెందిన ఆహార ఉత్పత్తులు వినియోగదారుల ఆరోగ్యానికి సురక్షితం కావని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం వెల్లడించింది. ప్రయోగశాల పరీక్షల్లో ఈ ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవడంతో, వాటిని తక్షణమే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని (రీకాల్) సదరు కంపెనీలను ఆదేశించింది. నీలగిరి ఆయిల్ అండ్ అల్లైడ్ ఇండస్ట్రీస్‌కు చెందిన 'షాలిమార్స్ చెఫ్ - కొరియాండర్ పౌడర్', ఆక్వాగ్రి ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 'క్యారెజీనన్' ఉత్పత్తులను నిలిపివేయాలని స్పష్టం చేసింది.
నీల్‌గిరి ఆయిల్ కంపెనీ ప్రాంగణం నుంచి సేకరించిన 'షాలిమార్స్ చెఫ్' ధనియాల పొడి నమూనాలను పరీక్షించగా, అందులో అనుమతించిన పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ఉత్పత్తి ఆరోగ్యానికి సురక్షితం కాదని అధికారులు వర్గీకరించారు. అయితే, అధికారుల నిర్ణయంపై సదరు కంపెనీ అప్పీల్ చేయడంతో మరోసారి పరీక్షలు నిర్వహించగా, అప్పుడు కూడా ఫలితాల్లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ఈ ఉత్పత్తి ప్రమాదకరమైనదేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ పునరుద్ఘాటించింది.
మరో కేసులో, ఆక్వాగ్రి ప్రాసెసింగ్ సంస్థ నుంచి సేకరించిన 'క్యారెజీనన్ (ఎర్రసముద్రం నుంచి సేకరించిన సీవీడ్ ఉత్పత్తి)' నమూనాలో అనుమతించిన స్థాయి కంటే ఎక్కువగా కాడ్మియం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కంపెనీ కూడా అప్పీల్ చేయగా, రిఫరల్ ల్యాబొరేటరీలో జరిపిన రీ-టెస్టింగ్‌లోనూ సదరు ఉత్పత్తి సురక్షితం కాదని తేలింది.
ఈ రెండు ఉత్పత్తులు ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ రీకాల్ ప్రొసీజర్) రెగ్యులేషన్స్, 2017 ప్రకారం, ఈ ఉత్పత్తులను మార్కెట్ నుంచి తక్షణమే ఉపసంహరించుకోవాలని సంబంధిత కంపెనీలను ఆదేశించింది.