సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క కూడా మృతి చెందిందని వార్తలు.. స్పష్టతనిచ్చిన కుటుంబ సభ్యులు
- ఆ శునకం ఏమైందన్న విషయంపై నెటిజన్ల చర్చ
- సుశాంత్ మృతి చెందినప్పటి నుంచి ఆహారం తినలేదని పోస్టులు
- ఆ కుక్క మృతి చెందలేదన్న సుశాంత్ కుటుంబ సభ్యులు
- సుశాంత్ ఇంట్లోనే ఆరోగ్యంగా ఉందని స్పష్టత
సుశాంత్ ఫొటోని చూస్తూ ఆ కుక్క కన్నీరు పెట్టుకున్న ఫొటోలు ఇటీవల బయటకు వచ్చాయి. వాటిని రీపోస్ట్ చేస్తోన్న నెటిజన్లు ఇప్పుడు ఆ కుక్క ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఆ కుక్క కూడా మృతి చెందిందని వార్తలు కూడా వస్తున్నాయి. సుశాంత్ మృతి చెందినప్పటి నుంచి అది ఎలాంటి ఆహారం తినలేదని కొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చివరకు సుశాంత్ కుటుంబ సభ్యులు స్పందించాల్సి వచ్చింది. ఆ కుక్క మృతి చెందలేదని, సుశాంత్ ఇంట్లోనే ఆరోగ్యంగా ఉందని చెబుతున్నారు.