పక్కన పెట్టిన కథపై దృష్టి పెట్టిన పూరి జగన్నాథ్

Puri Jagannath eyes on his dream project
  • 'జన గణ మన' ఆయన కలల ప్రాజక్ట్ 
  • మహేశ్ ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ
  • స్క్రిప్టు పట్ల ఆసక్తి చూపని మహేశ్
  • తదుపరి చిత్రం ఇదే అంటున్న పూరి
దర్శకుడు పూరి జగన్నాథ్ లో పట్టుదల ఎక్కువ. ఎంత కష్టతరమైనది అయినా తను అనుకున్నది చేసితీరతాడు. అందులోనూ తను ఎంతో ఇష్టపడి తయారుచేసుకున్న కథను ఎవరైనా రిజక్ట్ చేశారంటే దానిని కచ్చితంగా తెరకెక్కించి తీరతాడు. ఇప్పుడు 'జన గణ మన' సబ్జెక్టు విషయంలో ఆయన అదే పట్టుదలతో వున్నాడు.

మహేశ్ బాబుని దృష్టిలో పెట్టుకుని కొన్నాళ్ల క్రితం ఈ కథను ఆయన తయారుచేసుకున్నాడు. మహేశ్ కి కూడా కథ ఔట్ లైన్ నచ్చింది. అయితే, పూర్తి స్క్రిప్టు తయారయ్యాక మహేశ్ ఎందుకనో ఈ ప్రాజక్టు పట్ల ఆసక్తి చూపలేదు. దాంతో ఇది సెట్స్ కి వెళ్లకుండా ఆగిపోయింది. ఇప్పుడు దానిని త్వరలో తెరకెక్కించే ప్రయత్నాలలో ఆయన వున్నారు.

'ఇది నా డ్రీమ్ ప్రాజక్ట్. పాన్ ఇండియా స్థాయిలో దీనిని త్వరలోనే రూపొందిస్తా'నని పూరి జగన్నాథ్ తాజాగా చెప్పారు. దేశభక్తితో కూడిన ఈ కథను తప్పకుండా తెరకెక్కించాల్సిన బాధ్యత తనపై వుందని ఆయన అన్నారు. మిలటరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.

ప్రస్తుతం తాను విజయ్ దేవరకొండతో తీస్తున్న చిత్రం పూర్తవగానే 'జన గణ మన'ను సెట్స్ కు తీసుకెళతారని తెలుస్తోంది. మరి, ఇందులో ఏ హీరో నటిస్తాడన్నది త్వరలో వెల్లడవుతుంది. భారీ బడ్జెట్టుతో ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. 
Go Back to Shorts
Puri Jagannadh
Mahesh Babu
Janaganamana
Vijay Devarakonda

More Telugu News