నిర్మాతగా మహేశ్ బాబు .. హీరోగా విజయ్ దేవరకొండ?

karthi Movie
  • హీరోగా వరుస విజయాలు
  •  నిర్మాతగా ఇతర హీరోలతో సినిమాలు
  • దూకుడు పెంచుతున్న మహేశ్ బాబు  
మహేశ్ బాబు ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే మహేశ్ బాబు, ఈ మధ్యనే రూట్ మార్చాడు. ఓ మాదిరి బడ్జెట్ లో ఇతర హీరోల సినిమాలకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలా ప్రస్తుతం ఆయన అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.

ఇక ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది.  ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన వివరాలను వెల్లడి చేయనున్నారని చెబుతున్నారు. ఆ వెంటనే కార్తీ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి మహేశ్ బాబు సన్నాహాలు చేయిస్తున్నాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు.  ఇటు హీరోగానే కాదు .. అటు నిర్మాతగా కూడా మహేశ్ బాబు తన దూకుడు పెంచుతున్నాడన్న మాట.
Go Back to Shorts
Mahesh Babu
Vijay Devarakonda
karthi

More Telugu News