'ఆర్య' కథతో ముందుగా ప్రభాస్ దగ్గరికి వెళ్లిన సుకుమార్
- బన్నీకి హిట్ ఇచ్చిన 'ఆర్య'
- ఆసక్తిని చూపని రవితేజ, నితిన్
- 4 కోట్లతో నిర్మాణం .. 25 కోట్ల వసూళ్లు
ముందుగా ఆయన ఈ కథను పట్టుకుని ప్రభాస్ ను కలిశాడట. అతనికి కథ చెప్పిన తర్వాత, ఎక్కడైనా మార్పులు చేర్పులు వుంటే చెప్పమని, వాటిని సరిచేస్తానని సుకుమార్ చెప్పాడట. అయినా ప్రభాస్ ఎందుకో ఈ కథ పట్ల అంతగా ఆసక్తిని చూపలేదట. దాంతో రవితేజ .. నితిన్ లకు కూడా సుకుమార్ ఈ కథను వినిపించాడట. వాళ్లు కూడా అంతగా ఆసక్తిని కనబరచకపోవడంతో, అల్లు అర్జున్ ను కలిసి కథ చెప్పడం జరిగిందట. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య' యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. 4 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 25 కోట్లను రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసింది. అలా ఒక సంచలన విజయం అల్లు అర్జున్ ను వెతుక్కుంటూ వెళ్లిందన్న మాట.