'లవ్ స్టోరీ'కి సంబంధించి అదంతా పుకారేనంటున్న టీమ్
- శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథా చిత్రం
- చైతూ సరసన నాయికగా సాయిపల్లవి
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన చైతూ, కొన్ని సన్నివేశాల్లో సాయిపల్లవి తనని పూర్తిగా డామినేట్ చేసిందని భావించాడని చెప్పుకుంటున్నారు. ఆ సన్నివేశాలను మళ్లీ రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఈ విషయంపై తాజాగా ఈ సినిమా యూనిట్ సభ్యులు స్పందిస్తూ, ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ, సాయిపల్లవి - చైతూ కూడా పోటీపడి చేశారని అన్నారు. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల .. సాయిపల్లవి నుంచి వస్తున్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.