ఇండియాలో భారీగా పెరుగుతున్న కేసులు.. కరోనా తాజా అప్ డేట్స్!

Corona updates in India
  • 24 గంటల్లో కొత్తగా 1,396 కేసుల నమోదు
  • 27,892కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • 872కి చేరిన మరణాల సంఖ్య
లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనను కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1,396 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కి చేరుకుంది. వీటిలో 20,835 యాక్టివ్ కేసులు ఉండగా... 6,185 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 872కి చేరింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
Go Back to Shorts
Corona Virus
Deat Toll
India
Updates

More Telugu News