ఆ నర్సులు ‘మారు వేషంలో ఉన్న దేవతలు’ అంటూ చంద్రబాబు ఎనలేని ప్రశంసలు
- రాయ్ పూర్ ఎయిమ్స్ లో ‘కరోనా’తో ఉన్న మహిళకు చికిత్స
- ఆమె బిడ్డకు పాలు పట్టిన నర్సులు
- ఈ వీడియోను పోస్ట్ చేసిన చంద్రబాబు
రాయ్ పూర్ ఎయిమ్స్ లో ’కరోనా’ పేషెంట్ గా ఓ తల్లి చికిత్స పొందుతుండటంతో, అక్కడి నర్సులు ఆమె బిడ్డకు పాలు పడుతుండటం ఈ వీడియోలో కనబడుతుంది. ఎంతో ఓపికగా, జాగ్రత్తతో ఆ బిడ్డకు పాలు పడుతుంటాన్ని ప్రశంసించిన చంద్రబాబు ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 'ఎవరిపైన అయినా అమ్మ చూపినంత ప్రేమను చూపగలిగేది మారువేషంలో ఉన్న దేవతలు' మాత్రమే అంటూ ఆ నర్సులపై ఎనలేని ప్రశంసలు కురిపించారు.