జీతంతో సరిపెట్టుకోవడం లేదు.. ఆదాయం కోసం భారత యువత కొత్త దారులు
- 25 ఏళ్లలోపు 76 శాతం మందికి ఒక్కటికి పైగా ఆదాయ వనరులు
- క్యాపిటల్ గెయిన్స్, వ్యాపార ఆదాయం పెరుగుదల
- జీతంపైనే ఆధారపడేవారి సంఖ్య తగ్గుదల
- సీనియర్ సిటిజన్లు కూడా పెట్టుబడుల వైపు అడుగులు
- రూ.20 లక్షలకుపైగా ఆదాయం చూపిన వారి సంఖ్య పెరుగుదల
భారత యువత ఆదాయం సంపాదించే విధానంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. క్లియర్‌ట్యాక్స్ విడుదల చేసిన తాజా విశ్లేషణ ప్రకారం.. 25 ఏళ్లలోపు పన్ను చెల్లింపుదారుల్లో 76 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు చూపుతున్నారు. 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 14 శాతమే. జీతంతో పాటు షేర్ల లాభాలు, స్టాక్ ట్రేడింగ్, ఫ్రీలాన్సింగ్, సొంత వ్యాపారాల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. యువత సంపద సృష్టి వైపు వేగంగా అడుగులు వేస్తున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ మార్పు యువతకే పరిమితం కాలేదు. మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో 39 శాతం మంది క్యాపిటల్ గెయిన్స్‌ను ఆదాయంగా చూపించారు. నాలుగేళ్ల క్రితం ఇది కేవలం 9 శాతమే. మరోవైపు 26 శాతం మంది వ్యాపార ఆదాయాన్ని ప్రకటించారు. 2022-23లో ఈ సంఖ్య 4 శాతం మాత్రమే. ఫ్రీలాన్సింగ్, కన్సల్టింగ్, కంటెంట్ క్రియేషన్, స్వయం ఉపాధి వేగంగా పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో జీతం ఒక్కటే ఆదాయ మార్గం అనే పరిస్థితి క్రమంగా మారుతోంది.
ఈ ఏడాది క్లియర్‌ట్యాక్స్ ద్వారా దాఖలైన రిటర్నుల్లో కేవలం జీతాన్నే ఆదాయంగా చూపిన వారి వాటా 42 శాతానికి పడిపోయింది. నాలుగేళ్ల క్రితం ఇది 82 శాతం ఉండేది. సీనియర్ సిటిజన్లలోనూ 53 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు చూపించారు. అలాగే రూ.20 లక్షలకు పైగా స్థూల ఆదాయం ప్రకటించిన వారి వాటా 22 శాతం నుంచి 32 శాతానికి పెరిగింది. పెట్టుబడులు, వ్యాపారాలు, అదనపు ఆదాయ మార్గాల వల్ల భారతీయుల ఆర్థిక ప్రణాళికలో గణనీయమైన మార్పు వస్తోందని నిపుణులు చెబుతున్నారు.