మహేశ్ బాబు ట్వీట్ పై తెలంగాణ డీజీపీ ప్రతిస్పందన!
- క్లిష్ట సమయంలో పోలీసులు నిస్వార్థంగా పని చేస్తున్నారన్న మహేశ్
- ఇలాంటి వ్యాఖ్యలు తమ నిబద్ధతను పెంచుతాయన్న డీజీపీ
- ఒక ప్రశంస, ఒక చిరునవ్వు చాలంటూ వ్యాఖ్య
లాక్ డౌన్ సమయంలో తెలంగాణ పోలీసులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని స్టార్ హీరో మహేశ్ బాబు ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా కితాబిచ్చాడు. కరోనాపై యుద్ధంలో వారు చేస్తున్న సేవలను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో మన కుటుంబాల సంరక్షణ కోసం వారు ఎంతో పాటుపడుతున్నారని... దేశం కోసం, దేశ ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసులకు శాల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు అన్నారు. ఈ వ్యాఖ్యలపై డీజీపీ ప్రతిస్పందించారు.