Nara Lokesh: 'చంద్రబాబుతో పోలీసుల తీరు' వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్

lokesh fires on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
నిన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో తమ పార్టీ నేతలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. 'చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. జగన్ గారి హయాంలో ఫ్యాక్షన్ వికేంద్రీకరణ జరుగుతుంది. నిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైకాపా పెయిడ్ ఆర్టిస్టులు, ఇతర జిల్లాల నుండి తరలించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉత్తరాంధ్రకి ఫ్యాక్షన్ రాజకీయాలను పరిచయం చేశారు' అని ట్వీట్ చేశారు.
 
'ప్రతిపక్ష నాయకుడి ప్రజా చైతన్య యాత్రకి అనుమతులు ఇచ్చి అరెస్ట్ చేశారంటేనే పొలీసు వ్యవస్థని ఎంత నిష్పక్షపాతంగా నడిపిస్తున్నారో అర్థం అవుతుంది' అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో పోలీసులు వ్యవహరించిన తీరుకి సంబంధించిన వీడియోలను ఆయన పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News