నోలన్ సహా హాలీవుడ్ స్టార్లు వెళ్లిన ముంబై కేఫ్‌కు షాక్.. పరిశుభ్రత లోపాలతో లైసెన్స్ సస్పెండ్!
- ఒలింపియా కాఫీ హౌస్ లైసెన్స్ సస్పెండ్
- ఎఫ్‌డీఏ తనిఖీల్లో తీవ్ర లోపాల గుర్తింపు
- ఆహార నిల్వ ప్రాంతంలో మూత్రశాల ఉన్నట్లు గుర్తింపు
- కిచెన్‌లో కనిపించిన బొద్దింకలు, ఈగలు
- రిఫ్రిజిరేటర్‌లో మాంసం, రక్తపు అవశేషాలు
- కేఫ్‌ను జూలైలో సందర్శించిన హాలీవుడ్ స్టార్లు
హాలీవుడ్ స్టార్లు క్రిస్టోఫర్ నోలన్, మాట్ డామన్, టామ్ హాలండ్ సందర్శించిన ముంబైలోని ప్రముఖ ‘ఒలింపియా కాఫీ హౌస్’కు షాక్ తగిలింది. తీవ్రమైన అపరిశుభ్రత, ఆహార భద్రత లోపాలు బయటపడటంతో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ కేఫ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లైసెన్స్‌పై సస్పెన్షన్ కొనసాగనుంది.
కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌డీఏ అధికారులు కేఫ్‌లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆహారాన్ని నిల్వ చేసే ప్రదేశంలో మూత్రశాల ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌లో బొద్దింకలు, ఈగలు కనిపించాయి. రిఫ్రిజిరేటర్‌లో మాంసం, రక్తపు అవశేషాలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆహారం తయారు చేసే ప్రదేశం, పాత్రలు శుభ్రం చేసే ప్రాంతాల్లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. నేలపైనే ఆహార పదార్థాలను ఉంచి పని చేస్తున్నట్లు గుర్తించారు. శుభ్రంగా లేని నీటిని వాడుతున్నట్లు కూడా అధికారులు తెలిపారు. మాంసాహారం, శాకాహారాన్ని విడివిడిగా నిల్వ చేయడం లేదని గుర్తించారు.
వంటగదిలో దెబ్బతిన్న చెక్క కటింగ్ బోర్డులను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహారం తయారు చేసే సిబ్బంది సరైన రక్షణ దుస్తులు కూడా ధరించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.
మహారాష్ట్రలో మొత్తం 14 ఆహార సంస్థలపై ఎఫ్‌డీఏ చర్యలు తీసుకుంది. ముంబై సెంట్రల్‌లోని నాయర్ ఆసుపత్రి క్యాంటీన్ లైసెన్స్‌ను కూడా ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనల కారణంగా సస్పెండ్ చేశారు.
ఒలింపియా కాఫీ హౌస్ కొన్ని నెలల క్రితం హాలీవుడ్ ప్రముఖుల రాకతో వార్తల్లో నిలిచింది. జులైలో ‘ది ఒడిస్సీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముంబైకి వచ్చిన క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్, మ్యాట్ డేమన్ ఈ కేఫ్‌ను సందర్శించారు. అక్కడ టీతో పాటు బన్ మస్కా, కొన్ని డెజర్ట్స్ తీసుకున్నట్లు సమాచారం. 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కేఫ్ ఇరానీ, పార్సీ వంటకాలకు ప్రసిద్ధి చెందింది.