రీమేక్ సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు: దుల్కర్ సల్మాన్
- రొమాంటిక్ థ్రిల్లర్ గా 'కనులు కనులను దోచాయంటే'
- దుల్కర్ సల్మాన్ సరసన రీతూ వర్మ
- తమిళ .. తెలుగు భాషల్లో రేపే రిలీజ్
తెలుగు టైటిల్ గా 'కనులు కనులను దోచాయంటే'ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ .."రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. కథాకథనాలు .. పాటలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. మొదటి నుంచి కూడా నేను రీమేక్ లకు వ్యతిరేకిని. కొత్తగా వున్న కథలను చేయడానికే ఇష్టపడతాను. అలా కథాపరంగా .. పాత్ర పరంగా కొత్తగా అనిపించడం వల్లనే ఈ సినిమా చేశాను. ఈ సినిమా తప్పకుండా నాకు విజయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది. డైరెక్ట్ తెలుగు సినిమా చేయమంటూ కొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో చేసే అవకాశాలు వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.