'వి' సినిమా నుంచి హృద్యంగా సాగిపోయే అందమైన గీతం ఇదిగో!

Single relesed from V the movie
నాని, సుధీర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం 'వి'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై క్రమంగా హైప్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 'వి' సినిమా నుంచి మనసు మరీ అనే సాంగ్ రిలీజ్ చేశారు. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ పాటకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సంగీతం అందించారు. అమిత్ త్రివేది, సాషా తిరుపతి ఈ యుగళ గీతాన్ని హృద్యంగా ఆలపించారు. లెజెండరీ లిరిక్ రైటర్ 'సిరివెన్నెల' కలం నుంచి జాలువారిన అలతి అలతి పదాలతో కూడిన ఈ పాట వినసొంపుగా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్, ఆదితి రావు హైదరీ కథానాయికలు.

Go Back to Shorts
V
Nani
Sudhir Babu
Song
Manasu Maree
Sirivennela
Amit Trivedi
Tollywood

More Telugu News