జేసీబీని ఇలా కూడా వాడేయొచ్చా?.. నవ్వులు పూయించే వీడియో పోస్ట్ చేసిన ఐవైఆర్ కృష్ణారావు
- డీసీఎంలోంచి కిందకు దిగేందుకు జేసీబీని వాడిన మహిళలు
- గుజరాత్‌లో ఘటన
- వారి ఐడియాను మెచ్చుకున్న ఐవైఆర్
అయితే, గుజరాత్‌లో మాత్రం కొందరు మహిళలు తాము డీసీఎంలోంచి కిందకు దిగేందుకు జేసీబీని వాడేశారు. ఆ సమయంలో నవ్వు ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి పోస్ట్ చేస్తూ.. 'జేసీబీని కనిపెట్టిన వ్యక్తి ఎన్నడూ గుజరాత్‌లో పర్యటించకపోయుండొచ్చు.. తన ఆవిష్కరణను ఇలా వినియోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు' అని ట్వీట్ చేశారు.
దీన్ని రీట్వీట్ చేసిన ఐవైఆర్ కృష్ణారావు 'ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే ఆ ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి' అని పేర్కొన్నారు.