చంద్రబాబుపై వైఎస్ విజయ వేసిన కేసులు వీగిపోయాయి.. వైఎస్ హయాంలో పనిచేసిన అధికారులపై కేసులున్నాయి: కళా వెంకట్రావు

AP TDP Chief Kala Venkata Rao fires on YS Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తొమ్మిది నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందన్నారు. కూల్చివేతలు, రద్దులతో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రిలయన్స్, అదాని వంటి ప్రముఖ సంస్థలు కూడా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ రావడం లేదన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హులకు కోత పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుపై వైఎస్ విజయ వేసిన వ్యాజ్యాలు వీగిపోయాయని, కానీ వైఎస్ హయాం నాటి అధికారులపై ఇప్పటికీ కేసులు ఉన్నాయని కళా వెంకట్రావు గుర్తు చేశారు.
Go Back to Shorts
kala venkata rao
Andhra Pradesh
Telugudesam
YS Jagan

More Telugu News