Chiranjeevi: మెడలో ఎర్ర కండువాతో మెగాస్టార్‌ చిరంజీవి లుక్‌.. అదిరిపోయిందంతే!

chiranjeevi new look
షార్ట్స్‌లో చూడండి
మెడలో ఎర్ర కండువాతో మెగాస్టార్‌ చిరంజీవి కనపడ్డాడు.. 'అదిరిపోయిందంతే' అంటూ ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఖైదీ నంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టేస్తున్నారు.

ప్రస్తుతం  కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 152వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దేవాదాయ శాఖ‌లో జ‌రిగే అవినీతి అక్ర‌మాల‌ నేపథ్యంలో ఉంటుంద‌ని టాక్‌. అంతేగాక, న‌క్స‌లిజం అంశం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో చిరు నటిస్తుండగా తీసిన ఫొటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. చిరు కొత్త సినిమా లుక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
Go Back to Shorts
Chiranjeevi
Tollywood

More Telugu News