విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి ఆ రెండు జిల్లాల మధ్య ఫార్మా కంపెనీ ఉంది: వర్ల రామయ్య
- బోస్టన్ గ్రూప్ డైరెక్టర్ భట్టాచార్య స్నేహితుడే రోహిత్ రెడ్డి అన్న వర్ల రామయ్య
- రోహిత్ రెడ్డికి ఫార్మా కంపెనీ ఉందని వెల్లడి
- విశాఖ, విజయనగరం జిల్లాల్లో భూములున్నాయని ఆరోపణ
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ డైరెక్టర్ భట్టాచార్య స్నేహితుడు రోహిత్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడేనని పేర్కొన్నారు. విశాఖ-విజయనగరం జిల్లాల మధ్య రోహిత్ రెడ్డికి ఫార్మా కంపెనీ ఉందని, ఆ కంపెనీకి రెండు జిల్లాల్లో వందల ఎకరాల భూములున్నాయని వర్ల రామయ్య ఆరోపించారు. గత ఆర్నెల్ల కాలంలో అక్కడ వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారని వెల్లడించారు. అంతేకాకుండా, గతంలో అమరావతి ఎలా ఉండాలో చెప్పిన కేటీ రవీంద్రన్ ఇప్పుడు జీఎన్ రావు కమిటీలో సభ్యుడని తెలిపారు.