అసిస్టెంట్ కోరికమేరకు నటుడిగా మారిన గౌతమ్ మీనన్
గతంలో తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన మను ఆనంద్ కోసం గౌతమ్ మీనన్ నటుడిగా మారడం విశేషం. విష్ణు విశాల్ కథానాయకుడిగా మను ఆనంద్ 'ఎఫ్ ఐ ఆర్' అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయవలసిందిగా మను ఆనంద్ కోరడంతో, గౌతమ్ మీనన్ అందుకు అంగీకరించాడని అంటున్నారు. నిన్నటి నుంచే ఆయన కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణ మొదలైనట్టుగా చెబుతున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.