దేవిశ్రీప్రసాద్ తో పోటీపై స్పందించిన తమన్
- ఒకే సీజన్ లో విడుదలవుతున్న తమన్, దేవిశ్రీ చిత్రాలు
- అల వైకుంఠపురములో చిత్రానికి తమన్ సంగీతం
- సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవిశ్రీ బాణీలు
దేవిశ్రీ సంగీతంలో సరిలేరు నీకెవ్వరు, మీరు సంగీతం అందించిన అల వైకుంఠపురములో ఒకేసారి వస్తున్నాయి కదా, మీపై ఒత్తిడి ఉందా అని ప్రశ్నించగా, పోటీ ఉన్నప్పుడే మన స్టామినా ఏంటో తెలుస్తుందని తమన్ జవాబిచ్చారు. అయితే, దేవిశ్రీప్రసాద్ తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో సంభాషణలు కూడా జరుగుతుంటాయని తెలిపారు. అంతేకాదు, గతంలో తాను దేవిశ్రీప్రసాద్ వద్ద తొమ్మిది సినిమాలకు ప్రోగ్రామర్ గా వ్యవహరించానని వెల్లడించారు.