మరో 150 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీలో చేర్చిన దేవినేని అవినాశ్
- ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్
- విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు వైసీపీలో చేరిక
- కీలకపాత్ర పోషించిన అవినాశ్
అందరికీ వైసీపీ కండువాలు కప్పిన దేవినేని అవినాశ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలపరిచే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన అవినాశ్ ఓటమిపాలవడం తెలిసిందే. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని ఈ యువనేత ఆపై వైసీపీలో చేరారు. సీఎం జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు.