వివేకా హత్యకేసుపై సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వండి!: 'సిట్'కు హైకోర్టు ఆదేశం
- ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసు
- హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పిటిషన్
- సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని సిట్ ను ఆదేశించిన న్యాయస్థానం
ఈ నెల 23వ తేదీ లోపు దర్యాప్తు వివరాలను ఓ నివేదిక రూపంలో పొందపరిచి సీల్డ్ కవర్ లో తమకు సమర్పించాలని సిట్ ను ఆదేశించింది. ఆ నివేదికను తమతో పాటు ప్రభుత్వానికి కూడా అందివ్వాలని పేర్కొంది. పిటిషన్ పై తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.
కాగా, ఈ హత్యకేసులో సిట్ అధికారులు ఇటీవలే బీటెక్ రవిని కూడా విచారించారు. హత్య జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారు? హత్య జరిగిన విషయం మీకు ఎలా తెలిసింది? అంటూ ప్రశ్నించారు.