ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉంది: ఎన్కౌంటర్పై మంచు మనోజ్ స్పందన
- నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కుందా?
- ఈ రోజే దిశ ఆత్మ దేవుడ్ని చేరింది
- పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది
నిందితులను ఎన్కౌంటర్ చేసేందుకు పోలీసులు ఉపయోగించిన ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉందని, ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని అన్నాడు. ఎన్కౌంటర్ చేసిన ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని అన్నాడు. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కు ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
‘ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా’’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇటీవల దిశ ఇంటికి వెళ్లిన మనోజ్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.