దీనికి ఆద్యుడు దాదానే... ఆయన స్ఫూర్తితోనే ఫలితాలు రాబడతున్నాం: కోహ్లీ
- కోల్ కతా టెస్టులో టీమిండియా ఘనవిజయం
- తొలి డేనైట్ టెస్టును చిరస్మరణీయం చేసుకున్న కోహ్లీ సేన
- మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
టెస్టు క్రికెట్ అనేది మానసిక యుద్ధం అయితే, ఆ పోరాటాన్ని ఎలా గెలవాలో నేర్పించిన ఆద్యుడు గంగూలీ అని కోహ్లీ కొనియాడాడు. దాదా నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసంతో కఠినంగా పరిశ్రమించి, ఆ పరంపరను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించాడు.