విజయవాడలో స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం.. పోలీసుల దాడులు
- ఖరీదైన భవనాలను అద్దెకు తీసుకుని దందా
- దాడుల్లో పట్టుబడిన యువతులు, నిర్వాహకులు
- ఉక్కుపాదం మోపుతున్నామన్న కమిషనర్
ఈ సందర్భంగా పలువురు యువతులు, నిర్వాహకులు, విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. స్పాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇటువంటి దందాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఉపేక్షించబోమని సీపీ హెచ్చరించారు.