ఉద్ధవ్, ఆదిత్యలతో అర్ధరాత్రి పవార్ భేటీ... ప్రభుత్వ ఏర్పాటుపై ఇక ప్రకటన!
- కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
- మంత్రి పదవుల పంపకంపై కూడా
- నేడో, రేపో అధికారిక ప్రకటన
ఇక నేడు మూడు పార్టీలూ కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఆదివారంలోగా మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సమావేశంలో శివసేన, ఎన్సీపీలతో కలిసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్లూ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుంది.