ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎన్నికపై హైకోర్టు విచారణ.. నోటీసుల జారీ
- ఎన్నికల్లో పోటీ సందర్భంగా చెల్లని కులధ్రువీకరణ పత్రం సమర్పించారని ఆరోపణ
- ఆమె ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు
- కొండదొరగా పేర్కొంటూ ఆమె జత చేసిన ధ్రువీకరణ పత్రం చెల్లదంటూ పిటిషన్
ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీవాణి కొండదొరగా పేర్కొన్నారని, ఈ మేరకు కులధ్రువీకరణ పత్రం సమర్పించారని పేర్కొన్నారు. అయితే అది చెల్లుబాటు కాదని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు మంత్రి శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.