చంద్రబాబు దీక్ష వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకోబోతోంది: టీడీపీ నేత వర్ల రామయ్య
- మంత్రి బొత్స బినామీలకు 50 ఇసుక లారీలున్నాయని ఆరోపణ
- కార్మికుల ఆత్మహత్యలపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు దారుణమన్న వర్ల
- మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు
తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష జగన్ ప్రభుత్వం మెడకు చుట్టుకోబోతుందని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ బినామీలకు 50 ఇసుక లారీలు ఉన్నాయని ఆరోపించారు. విజయనగరంలో ఇసుక అక్రమ రవాణాపై బొత్స, ఎంపీ మధ్య విభేదాలున్నాయని చెప్పారు.