పాదయాత్ర చేస్తున్నప్పుడే భూములపై జగన్ కన్నేశారు: చినరాజప్ప
- అప్పుడు గుర్తించిన భూములను ఇప్పుడు అమ్మేందుకు యత్నిస్తున్నారు
- ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు
- అమరావతి అభివృద్ధిని కావాలనే వదిలేశారు
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ లను న్యాయవాదులతో కలసి పరిశీలిస్తామని... ఆ తర్వాత ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ కు నివేదికను అందిస్తామని చినరాజప్ప తెలిపారు. అధికారులను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని... కానీ, ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన తీరు సరికాదని అన్నారు. అమరావతి అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం కావాలనే వదిలేసిందని విమర్శించారు.