కమలం గూటికి టీడీపీ నాయకురాలు యామిని?
- అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి టీడీపీపై అసంతృప్తితో ఉన్న నాయకురాలు
- ఈ నెల 10న బీజేపీలో చేరేందుకు ముహుర్తం ?
- పార్టీలో అధికార ప్రతినిధి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్
అయితే, అప్పట్లో చంద్రబాబు ఆమెను సముదాయించడంతో మిన్నకుండిపోయారు. తాజాగా బీజేపీ ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ఆమెను బీజేపీ నేతలు సంప్రదించారు. పార్టీ అధికార ప్రతినిధి పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఆమె కూడా రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు కూడా జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 10న అధికారికంగా కమలం పార్టీలో చేరునున్నారని సమాచారం.