అండమాన్ వద్ద సముద్రంలో అల్పపీడనం.. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు!
- వచ్చే 48 గంటల్లో సముద్రంలో అల్పపీడనం
- అరేబియా సముద్రంలో కొనసాగుతున్న రెండు తుపాన్లు
- బలహీన పడిన ‘క్యార్’ తుపాను
మరోవైపు, అరేబియా సముద్రంలో రెండు తుపాన్లు కొనసాగుతుండగా, సూపర్ సైక్లోన్‌గా మారిన ‘క్యార్’ బలహీనపడి పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తుపానుగా కొనసాగుతోంది. నేడు ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘మహా’ తుపాను నిన్న సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలహీనపడి, రాత్రికి లక్షదీవుల వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.