రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం.. 50 మందికిపైగా గాయాలు
- ఇలవేల్పును దక్కించుకునేందుకు కర్రలతో తలపడే గ్రామస్థులు
- అనాదిగా వస్తున్న ఆచారం
- ఫలితమివ్వని అవగాహన కార్యక్రమాలు
ఈ ఆచారం హింసాత్మకంగా ఉండడంతో దీనిని నివారించేందుకు గత కొంతకాలంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, లఘు చిత్రాలు ప్రదర్శించడం వంటి అవగాహన కార్యక్రమాలను నెల రోజుల ముందు నుంచే చేపట్టినప్పటికీ సమరాన్ని మాత్రం నిలువరించలేకపోయారు. దీంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్ వాహనాలతో నిఘా పెట్టారు. వెయ్యిమందికి పైగా పోలీసులను మోహరించి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించారు.